కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేస్తూ రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది.
దర్శకుడు రవి నంబూరి తన తొలి సినిమా ఇంతటి విజయం సాధించ డం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విశేషాలను పంచుకున్నారు.
ఒక మంచి సినిమాను ప్రేక్ష కులకు సరైన రీతిలో అందించ గలిగాననే నమ్మకం ఈ విజయం కలిగించింది. బాక్సాఫీస్ వసూళ్ల కంటే ప్రేక్షకుల ప్రశంసలు, భావో ద్వేగ అనుబంధమే నాకు మరింత సంతృ ప్తినిచ్చిందన్నారు. తొలి సినిమానే రూ.50 కోట్ల వసూళ్లు సాధించడం ఆనందంగా ఉంది. ఈ ఫలితాన్ని ముందే ఊహించాను.
ఈ కథను సాయి రాజేష్ స్వయంగా నాకు చెప్పారు. కథలోని భావో ద్వేగాలు, సవాలు నన్ను బాగా ఆకట్టుకోవడంతో వెంటనే దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాను. స్క్రీన్ ప్లేను ఇద్దరం కలిసి రూపొందించగా, డైలాగ్స్‌ను నేను రాశాను. ఈ సినిమాలోని డైలాగ్స్‌కు వస్తున్న ప్రశంసలు నాకెంతో ఆనందాన్ని ఇచ్చాయి. గతంలో మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతి రోజు పండగే’, ‘పక్కా కమర్షియల్’ చిత్రా లకు కూడా రైటింగ్ విభాగంలో పనిచేసిన అనుభవం ఈ సినిమాకు ఎంతో ఉపయోగపడింది.
శ్రీ గౌరి ప్రియను నేనే సూచిం చాను. ఆమె నటన ఈ కథకు బాగా సరిపోతుందని భావించి సాయి రాజేష్‌తో చర్చించి ఎంపిక చేశాను. ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసి సినిమా భావోద్వేగా లను మరింత బలంగా నిలబెట్టింది.
హీరో కిరణ్ అబ్బవరం ఈ చిత్రం లోని స్టీవెన్ శంకర్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇప్పటి వరకు ఆయన చేసిన అత్యంత సెటిల్డ్ పర్ఫా ర్మెన్స్‌లలో ఇదొకటిగా నిలవడం చాలా ఆనందంగా ఉంది.
ఇదే అసలైన విజయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



