Tuesday, August 4, 2026
E-PAPER
Homeఆటలుతన్వీ శర్మ పైనే ఫోకస్‌

తన్వీ శర్మ పైనే ఫోకస్‌

- Advertisement -

నేటి నుంచి కొరియా ఓపెన్‌
గ్వాంగ్జు (దక్షిణ కొరియా)

బిడబ్ల్యూఎఫ్‌ ‌వరల్డ్‌ ‌టూర్‌ ‌దక్షిణ కొరియాకు చేరుకుంది. కొరియా ఓపెన్‌ ‌సూపర్‌ 300 టోర్నమెంట్‌ 18వ సీజన్‌ ‌నేటి నుంచి ఆరంభం కానుంది. గ్వాంగ్జులోని జిన్నమ్‌ ‌స్టేడియంలో జరుగనున్న వరల్డ్‌ టూర్‌ ‌సూపర్‌ 300 ‌టోర్నమెంట్‌‌లో భారత వర్థమాన షట్లర్‌ ‌తన్వీ శర్మ టైటిల్‌‌పై కన్నేసి బరిలోకి దిగుతోంది. తాజాగా తైపీ ఓపెన్‌ ‌విజయంతో కెరీర్‌ తొలి వరల్డ్‌ ‌టూర్‌ ‌సాధించిన తన్వీ శర్మ మహిళల సింగిల్స్‌‌లో ఇక్కడ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. మహిళల సింగిల్స్‌‌లో తన్వీ శర్మతో పాటు ఇషారాణి, మాళవిక బాన్సోద్‌, శ్రియాన్షి, అన్మోల్‌, రక్షిత శ్రీ, అష్మిత చాలిహ, తాన్య హేమంత్‌, అకర్షి కశ్యప్‌, మాన్షి సింగ్‌‌లు బరిలోకి దిగుతున్నారు. పురుషుల సింగిల్స్‌‌లో మాజీ వరల్డ్‌ నం.1 కిదాంబి శ్రీకాంత్‌‌తో పాటు కిరణ్‌ ‌జార్జ్‌, తరుణ్‌ ‌మానెపల్లి, మిథున్‌ మంజునాథ్‌, రౌనక్‌ ‌చౌహాన్‌, సనీత్‌ ‌దయానంద్‌, శంకర్‌ ‌ముతుస్వామి, తుషార్‌ ‌సువీర్‌‌లు పోటీపడుతున్నారు. సీనియర్‌ ‌షట్లర్లు హెచ్‌.ఎస్‌ ‌ప్రణయ్‌, లక్ష్య శర్మ, ప్రియాన్షు రజత్‌‌లు పోటీ నుంచి తప్పుకున్నారు. నేడు ప్రధానంగా అర్హత మ్యాచ్‌‌లు జరుగనుండగా.. బుధవారం నుంచి ప్రధాన టోర్నమెంట్‌ ఆరంభం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -