Tuesday, August 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచర్చలపై చెరో మాట

చర్చలపై చెరో మాట

- Advertisement -

మొదలవుతాయి : ట్రంప్.. అలాంటిదేం లేదు : ఇరాన్
నవతెలంగాణ – జనరల్ డెస్క్

మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ – అమెరికా మధ్య జరగాల్సిన చర్చల విషయంలో ప్రతిష్టంభన నెల కొంది. సోమవారం చర్చలు ప్రారంభ మవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా అమెరికాతో చర్చలేవీ జరపడం లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. హార్ముజ్ జలసంధిలో నౌకలు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ఓ తాత్కాలిక మార్గాన్ని ఏర్పాటు చేసే విషయంపై ఒమన్‌తో చర్చిస్తున్నామని తెలిపింది. ఒకవేళ ఒమన్‌తో ఒప్పందం కుదిరినప్పటికీ జలమార్గాన్ని తెరిచేం దుకు అది సరిపోదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చెప్పారు. ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగినంత కాలం పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన అన్నారు. ట్రంప్ అంతకుముందు ఓ ప్రకటన చేస్తూ ఇరాన్‌తో సోమవారం మధ్యాహ్నం చర్చలు ప్రారంభమవుతాయని తెలిపారు. అయితే ఒప్పందానికి గడువును నిర్ణయించేందుకు ఆయన నిరాకరించారు. హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు త్వరగా ఒప్పందం కుదురుతుందని, టెహ్రాన్ అణు సామర్ధ్యాలపై నెలకొన్న వివాదం పరిష్కారం అవుతుందని ఆశించినందునే దాడులను నిలిపివేశానని చెప్పుకొచ్చారు.
అయితే తాము ప్రస్తుతం అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘై స్పష్టం చేశారు. హార్ముజ్ నిర్వహణపై ఒమన్‌తోనే చర్చలు కొనసాగు తున్నాయని చెప్పారు. అయితే హార్ముజ్‌ను తెరవడం, మయడంపై తాము చర్చించుకోవడం లేదని, ప్రస్తుతం జరుగుతున్న చర్చలకు దీనికి సంబంధం లేదని అన్నారు. కాగా హార్ముజ్‌పై ఇరాన్, ఒమన్ మధ్య జరుగుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని ఇరాన్ వార్తా సంస్థ ఇర్నా తెలియజేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -