Tuesday, August 4, 2026
E-PAPER
Homeజాతీయంస్తంభించిన పార్లమెంట్‌

స్తంభించిన పార్లమెంట్‌

- Advertisement -

​నీట్‌ పేపర్‌ లీక్‌, అయోధ్య రామాలయ విరాళాల
చోరీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఆందోళన
నిరసనల మధ్యే ఉభయ సభల్లో రెండు బిల్లులు
​ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

నీట్ పేప‌ర్ లీకేజీ, అయోధ్య రామాల‌య విరాళాల చోరీ ఘ‌ట‌న‌లకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంట్ స్తంభించింది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన అణచివేతకు హోం మంత్రి సరైన వివరణ ఇచ్చే వరకు పార్లమెంటులో తమ ఆందోళనను కొనసాగి స్తామని ప్రతిపక్షం పేర్కొంది. ఈ డిమాండ్‌ తో లోక్‌సభ, రాజ్యసభలలో ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ఆందోళన చేయడంతో సభా కార్యకలాపాలకు పలుమార్లు అంతరా యం ఏర్పడింది. జంతర్ మంతర్ వద్ద పోలీసుల అరాచకాలకు, అయోధ్యలోని రామ మందిర దోపిడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పార్లమెంటు వెలుపలా నిరసన తెలిపాయి. ‘అమిత్ షా పార్లమెంటుకు ఎందుకు రావడం లేదు?’ అంటూ రాసి ఉన్న పెద్ద బ్యానర్‌ను ప్రదర్శించడంతో పాటు ప్లకార్డులతో ఆందోళన చేపట్టాయి. వర్షాకాల సమావేశాలు మూడో వారంలోకి ప్రవేశించినప్పటికీ ఉభయ సభలలో ప్రతిపక్షాలు కొనసాగిస్తున్న ఆందోళన కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించాయి. ఈ భారీ నిరసనల మధ్యే ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచే చట్ట సవరణ లోక్‌సభలో ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. అదే విధంగా ప్రతిపక్షాల నిరసనల మధ్యే రాజ్యసభలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ సహకార (సవరణ) చట్టానికి మద్దతుగా తన నివేదికను సమర్పించింది. స్వల్ప మార్పులతో ఈ బిల్లును చట్టంగా మార్చాలని జేపీసీ సిఫారసు చేసింది. లోక్‌సభలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ స్తంభించిన పార్లమెంట్‌ సవరణ బిల్లు, కేంద్ర స‌హాయ మంత్రి రావు ఇంద్ర‌జిత్ సింగ్‌.. ఇండియ‌న్ స్టాటిస్టికల్‌ ‌ఇనిస్టిట్యూట్‌ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది బ్యాంకు రికార్డులను కోర్టులో విశ్వసనీయ సాక్ష్యంగా స్వీకరించడానికి అనుమతిస్తుంది. 1891 నాటి చట్టం స్థానంలో వచ్చిన ఈ కొత్త చట్టంలో, డిజిటల్, ఎలక్ట్రానిక్, వర్చువల్ రికార్డులను బ్యాంకు రికార్డులుగా చేర్చడానికి నిబంధనలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మెన్‌ ఉభయ సభలలో ప్రతిపక్షాల నిరసనలను అణచివేసేందుకు పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. జంతర్ మంతర్ వద్ద పోలీసుల చర్య, అయోధ్యలో దారుణాలపై వివరంగా చర్చించకుండా నిరసనల నుం‌చి వెనక్కి తగ్గబోమని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. నిరసనలు తీవ్రతరం కావడంతో ఉభయ సభలను నేటికి వాయిదా వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్ నిరసనల కోసం ప్రణాళికలు రూపొందించడానికి ఇండియా బ్లాక్ ఎంపీలు సమావేశమయ్యారు.

పార్లమెంట్ లో ఆందోళన
అయోధ్యలోని రామమందిర విరాళాల చోరీపై ప్రతిపక్ష ఎంపీలు సోమవారం కూడా ఆందోళన కొనసాగించారు. రామ మందిరం విరాళాల చోరీతో పాటు విద్యార్థి నిరసనకారుల పట్ల పోలీసుల బలప్రయోగంపై పార్లమెంట్‌ ప్రాంగణంలోని మకర ద్వారం ఎదుట నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్, శివదాసన్, ఎస్పీకి చెందిన డింపుల్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, టీఎంసీకి చెందిన మహువా మోయిత్రా, జెఎంఎంకు చెందిన మహువా మాఝీ, ఆర్‌ఎస్పీకి చెందిన ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్ తదితర ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. రామమందిరంలో విరాళాల చోరీకి ప్రతీకగా విరాళాల పెట్టెలను పార్లమెంట్‌ ఆవరణలో ఉంచారు. ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాటి చుట్టూ బారులు తీరారు. కొందరు ఎంపీలు విరాళాల పెట్టెలో నగదు కూడా వేశారు. అనంతరం విరాళాల ఆదాయం లెక్కింపు సందర్భంగా చోరీ చేయడాన్ని ప్రదర్శించారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -