– ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల అధ్యాపక సంఘం వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఎయిడెడ్ కాలేజీలకు పూర్వవైభవం తేవాలని తెలంగాణ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల అధ్యాపక సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంను శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆ సంఘం అధ్యక్షులు ఎస్ బిక్షం, ప్రధాన కార్యదర్శి గంటా జలంధర్‌రెడ్డి కలిశారు. ఎయిడెడ్ కాలేజీలకు పూర్వవైభవం తెచ్చేందుకు తమ వంతు పాత్ర పోషిస్తామని తెలిపారు. ఈ విషయంపై త్వరలోనే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని బుర్రా వెంకటేశం హామీనిచ్చారని పేర్కొన్నారు.