సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి
నవతెలంగాణ – మల్హర్ రావు
తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని అంగన్ వాడిల సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి అన్నారు.అంగన్ వాడి వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మండలం మల్లారంతోపాటు పెద్దతూండ్ల, గాదంపల్లి గ్రామాల్లో అంగన్వాడి కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ మేకల రాజయ్య, ఉప సర్పంచ్ పురుషోత్తమరావు హాజరైయ్యారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ మాట్లాడారు. పిల్లలు పుట్టిన పసిబిడ్డకు గంటలోపు పాలు పట్టిస్తే రోగ నిరోధక శక్తిని పెంచుతాయని చెప్పారు. మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. ఆరు నెలల తర్వాత ఇంట్లో తయారు చేసిన పౌష్టికాహారాన్ని ప్రారంభించి రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్ వాడి టీచర్లు, ఆయాలు, గర్బినీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.
తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



