జిల్లా వైద్యాధికారి మధుసూదన్
నవతెలంగాణ – మల్హర్ రావు
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని భూపాలపల్లి జిల్లా వైద్యాధికారి మధుసూదన్ అన్నారు.మంగళవారం తాడిచెర్ల ఆరోగ్య కేంద్రాన్ని తన వైద్య బృందంతో తనిఖీలు చేపట్టారు.వనమహోత్సవంలో భాగంగా ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటికి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.కార్యక్రమానికి ముందుగా ఆరోగ్య కేంద్రంలో రోజువారీ సిబ్బంది హాజరు రిజిస్టర్,ఓపి బుక్ స్టాప్,మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆశ డే,క్షయ వ్యాధిగ్రస్తుల వివరాలు,ఎన్.హెచ్.ఎం,ఎన్.సి.డి, ఏ.ఎన్.సి,క్యాంపు,సబ్ సెంటర్స్,ఎన్.సి.డి స్క్రీనింగ్ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉప కేంద్రాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని మండల వైద్యాధికారిని ఆదేశించారు.ఆరోగ్య కేంద్ర పరిధిలో విధులు నిర్వహిస్తున్న సూపర్ వైజర్స్,సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కాకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ శ్రీదేవి,డాక్టర్ దేవేందర్,డాక్టర్ సందీప్,డాక్టర్ నాగరాణి,డిడిఎం మధుబాబు,డిపిఓ చిరంజీవి,తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి వినయ్ భాస్కర్,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.



