Wednesday, August 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఢిల్లీలో బుల్డోజర్ రాజ్ ​కార్పొరేట్లకు భూములు

ఢిల్లీలో బుల్డోజర్ రాజ్ ​కార్పొరేట్లకు భూములు

- Advertisement -

అప్పగించేందుకు బీజేపీ ప్రయత్నాలు
పేద‌ల‌ను వెళ్ల‌గొట్టేందు‌కే బుల్డోజ‌ర్లు
కూల్చివేతల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి
ఆవాస్‌ అధికార్‌ ‌జన్‌- ఆందోళన్‌ ఆధ్వర్యంలో
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్ రాజ్‌కు పాల్ప‌డుతోంద‌ని ఆవాస్ అధికార్ జన్-ఆందోళన్ విమ‌ర్శించింది. మంగ‌ళ‌వారం నాడిక్క‌డ జంతర్ మంతర్ వద్ద మురికివాడల (స్లమ్స్) తొలగింపులు, బలవంతపు ఖాళీ చేయింపులు, పునరా వాస వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ‘ఆవాస్ అధికార్ జన్-ఆందోళన్’ (గృహ హక్కుల ప్రజా ఉద్యమం) ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌ జరిగింది. బుల్డోజర్ కూల్చి వేతల ప్రక్రియను తక్షణమే నిలిపివే యాలని, గౌరవప్రదమైన పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎంపీ అమ్రారామ్ మాట్లాడుతూ ఢిల్లీతో సహా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నిం టిలోనూ పేదలను వెళ్లగొట్టి, భూములను కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయని విమ‌ర్శించా రు. పేదలను వెళ్లగొట్టడానికి బుల్డోజర్లను ఉపయోగిస్తున్నారని అన్నారు. ‘‘బీజేపీ ప్రభుత్వం మా బస్నీ గ్రామంలో కూడా ఇండ్లను కూల్చివేయడానికి ప్రయత్నిం చింది. నా శరీరంపై బుల్డోజర్‌ను నడిపిన తర్వాతే ఇండ్లను కూల్చివేయాలని నేను గట్టిగా నిలబడ్డాను. ఫలితంగా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రభుత్వం కేవలం పోరాటంతోనే వెనక్కి తగ్గుతుందని ఇది స్పష్టం చేస్తోంది’’ అని అమ్రారామ్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి జైసల్మేర్ వరకు పేద శ్రామికులను వారి ఇండ్ల నుంచి తొలగిస్తూనే, లక్షలాది ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తోందని విమర్శించారు. కొద్ది రోజుల క్రితమే జంతర్ మంతర్ వేదికగా జరిగిన ఆందోళన కేంద్ర మంత్రి రాజీనామాకు దారితీసిందని గుర్తుచేసిన ఆయన, పేదలకు వ్యతిరేకమైన ఈ తొలగింపు విధానాన్ని ఆపకపోతే ప్రజా ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు.
కార్పొరేట్‌ ‌శక్తుల
ప్రయోజనాలు కాపాడేందుకే
‘‘ఈ ప్రభుత్వం పేదరికాన్ని తొలగించడం లేదు. పేదలనే తొలగి స్తోంది. మోడీ ప్రభుత్వం, ఢిల్లీలోని రేఖా గుప్తా ప్రభుత్వం కార్పొరేట్లు, శక్తివంతుల ప్రయోజనాలను కాపాడుతూనే పేదల ఇండ్లను కూల్చివేస్తున్నాయి’’ అని సీపీఐ ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. సీపీఐఎంఎల్ ఎంపీ రాజా రామ్ మాట్లాడుతూ బంకీపూర్ (బీహార్), దతియా (మధ్యప్రదేశ్) ఉప ఎన్నికల ఫలితాలు .. బీజేపీ రాజకీయ ఆధిపత్యం క్రమంగా క్షీణిస్తోందని, ఆ పార్టీ పతనం ఆసన్నమైందనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పోరాటాలు, ఎన్నికల ప్రక్రియ రెండిం టితో ప్రజలు బీజేపీని ఓడిస్తున్నారని అన్నారు. అభివృద్ధి పేరుతో పేదలను స్థానభ్రంశం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సీపీఐఎంఎల్‌ నాయకురాలు సుచేతా దే అన్నారు. ప్రభుత్వం తన బుల్డోజర్ రాజకీయాలను వీడనాడి, ప్రతి పౌరుడికి గృహ హక్కును కల్పించాలని ఆమె ఉద్ఘాటించారు.
సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో మాజీ సభ్యురాలు సుభాషిణి అలీ మాట్లాడుతూ ‘‘ఈనాడు బీజేపీకి కమలంతో కాదు, బుల్డోజర్‌తోనే గుర్తింపు వచ్చింది. పేదల ఇండ్లను కూల్చివేయడం, వారి హక్కులను కాలరాయడం దాని రాజకీయాలకు నిర్వచనాత్మక చిహ్నంగా మారింది’’ అని అన్నారు. ఫార్వర్డ్ బ్లాక్‌కి చెందిన ధర్మేంద్ర కుమార్ వర్మ, ఆర్‌ఎస్పీకి చెందిన ఆర్. ఎస్. దాగర్, సీజీపీఐకి చెందిన బిర్జు, సోనియా విహార్ సంఘర్ష్ సమితి నాయకుడు రంజీత్ తివారీ ప్రసంగిం చారు. ఢిల్లీలో కొనసాగుతున్న తొలగింపు చర్యలు పేదలకు, ప్రజలకు వ్యతిరేకమైన విగా ఖండించారు. ప్రభావిత కుటుం బాలన్నింటికీ ముందుగా గౌరవప్రదమైన పునరావాసం కల్పించకుండా ఎలాంటి కూల్చివేత ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఢిల్లీ కేవలం ధనవంతులకు, రియల్ ఎస్టేట్ డెవలపర్‌‌లకు మాత్రమే కాకుండా, ఈ నగరాన్ని నిర్మించి, నిలబెట్టిన శ్రామిక ప్రజలకు కూడా సమానంగా చెందుతుందని వక్తలు నొక్కి చెప్పారు. గృహవసతి అనేది దానధర్మం కాదని, అది ప్రతి పౌరుడి రాజ్యాంగ బద్ధమైన, మానవ హక్కు అని స్పష్టం చేశారు. బుల్డోజర్లతో కూల్చివేతలు, బలవంతపు తొలగింపుల విధానం కొనసాగితే, తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి ఢిల్లీ వ్యాప్తంగా విస్తరిస్తామని హెచ్చ‌రించారు.​ ఈ ఆందోళ‌న‌లో సీపీఐ(ఎం) సీనియర్ నాయ‌కులు బృందా కరత్, ఢిల్లీ రాష్ట్ర కార్య‌ద‌ర్శివ‌ర్గ‌ సభ్యులు రాజీవ్ కున్వర్, పి.వి. అనియన్ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలో అక్రమంగా ఇండ్లను కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు కూడా ప్రధానమంత్రికి, కేంద్ర హోం మంత్రి, కేంద్ర గృహ నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రి, ఢిల్లీ సీఎంకు వినతిపత్రం సమర్పించాయి. అన్ని రకాల కూల్చివేతలు, బలవంతపు ఖాళీల‌ను తక్షణమే నిలిపివేయాలని, అలాగే ప్రభావితమైన కుటుంబాలన్నింటికీ గౌరవప్రదమైన పునరావాసం కల్పించా లని డిమాండ్ చేశాయి. డీయూఎస్ఐబీ పునరావాస విధానం-2015కు అనుగు ణంగా ఐదు కిలోమీటర్ల పరిధిలో అక్కడి కక్కడే పునరావాసం కల్పించాలనీ, జోన్-ఓలో నివసిస్తున్న కుటుంబాలకు సమాన పునరావాస హక్కులు కల్పించాలనీ, ముందస్తు పునరావాసం లేకుండా రైల్వే భూముల నుంచి తొలగింపులను పూర్తిగా నిషేధించాలనీ, జాబితా నుంచి తొల గించబడిన 82 మురికివాడలను డీయూఎస్ఐబీ నోటిఫైడ్ జాబితాలో తిరిగి చేర్చాలనీ, బాధితులైన అన్ని కుటుం బాలకు గౌరవప్రదమైన గృహవసతి కల్పించాలని డిమాండ్ చేశాయి. ఆందోళన
పాల్గొన్నవామపక్ష‍ాలు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -