నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్టీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సు మోటోగా కేసు నమోదు చేసింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఎస్టీ బాలికల వసతి గృహంలో కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల 27 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్టు ఓ పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా చైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలోని కమిషన్ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో, ఘటనకు దారితీసిన పరిస్థితులు, అస్వస్థతకు గురైన విద్యార్థినుల సంఖ్య వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, అందించిన వైద్య చికిత్స, వసతి గృహంలో ఆహార నాణ్యత, పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై నిర్వహించిన విచారణ ఫలితాలు, బాధ్యులపై తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకున్న నివారణ, సరిదిద్దే చర్యల గురించి తెలపాలని కోరింది. నివేదిక సమర్పణ కోసం కేసును ఈనెల ఏడో తేదీకి వాయిదా వేసింది.
కలుషిత ఆహార ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



