Wednesday, August 5, 2026
E-PAPER
Homeక్రైమ్యాసిడ్ ట్యాంకర్ బోల్తా

యాసిడ్ ట్యాంకర్ బోల్తా

- Advertisement -


గద్వాల జిల్లా నందిన్నె సమీపంలో ఘటన
నవతెలంగాణ-ధరూర్

జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటిరెడ్డి మండలంలో కర్నాటక-రాయచూర్ సరిహద్దుల్లో నందిన్నె గ్రామ సమీపంలోని సంఘం బావి దగ్గర యాసిడ్ ట్యాంకర్ బోల్తా పడింది. రాయచూరు నుంచి గద్వాలకు వస్తున్న తరుణంలో మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు అదుపుతప్పి యాసిడ్ ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్‌ ‌నుంచి వెలువడిన యాసిడ్‌ ‌గాలిలో వేగంగా వ్యాపించడంతో నందిన్నె గ్రామస్తులు అటువైపు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. యాసిడ్‌ గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రజల ప్రాణరక్షణ దృష్ట్యా అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ప్రమాద స్థలానికి కిలోమీటర్ పరిధిలోకి ఎవరూ వెళ్లకూడదని తెలిపారు. యాసిడ్‌ ‌ప్రభావం తగ్గే వరకు ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లవద్దని చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కోరారు. అత్యవసరమైతే ముక్కు, నోటికి తడి గుడ్డ లేదా మాస్క్ అడ్డుపెట్టుకోవాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -