Wednesday, August 5, 2026
E-PAPER
Homeజాతీయండీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ అరెస్టు.. విడుదల

డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ అరెస్టు.. విడుదల

- Advertisement -

సీఎం విజయ్, సినీనటి త్రిషను ఉద్దేశిస్తూ
చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై కేసు
చెన్నై :
డీఎంకే కీలక నేత, తమిళనాడు ప్రతిపక్ష‍ నేత ఉదయనిధి స్టాలిన్‎ అరెస్టయ్యారు. అనంతరం విడుదలయ్యారు. సీఎం విజయ్, సినీనటి త్రిషను ఉద్దేశిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు ఆయనను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్‎కు తరలించారు. దీంతో స్టాలిన్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరెస్ట్‎ను నిరసిస్తూ పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా డీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, డీఎంకే శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. డీఎంకే కార్యకర్తలను చెదరగొట్టి పోలీసులు ఆయనను తరలించారు. అనంతరం ఈ కేసులో ఆయనకు మద్రాస్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. విచారణ పూర్తయిన వెంటనే ఆయనను విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో మంగళవారం సాయంత్రం ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు విడుదల చేశారు. పాలక టీవీకే కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నైలోని ఆయన నివాసంలో ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -