Thursday, August 6, 2026
E-PAPER
Homeజిల్లాలుఅవినీతికి పాల్పడుతున్న ఆస్పత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి

అవినీతికి పాల్పడుతున్న ఆస్పత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి

- Advertisement -

డీవైఎఫ్ఐ హైదరాబాద్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో నీలోఫర్ ఆస్పత్రి ముందు ఆందోళన
సూపరింటెండెంట్ విజయ్ కుమార్ కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ – హైదరాబాద్

నీలోఫర్ ప్రభుత్వాస్పత్రిలో అవినీతి అక్రమాలపై విచారణ చేసి, అవినీతికి పాల్పడిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆస్పత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా డివైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి జావీద్ మాట్లాడుతూ.. నీలోఫర్ ఆస్పత్రికి రాష్ట్రంలో మారుమూల గ్రామాల నుండి అత్యవసర, మెరుగైన వైద్య సేవలకై పేద ప్రజలు వస్తుంటారని చెప్పారు. అయితే కొంతమంది ఆస్పత్రి సిబ్బంది చేతివాటం ప్రదర్శించి, వీరినుంచి డబ్బులను డిమాండ్ చేయడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.

ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా సందర్భాలలో జరిగాయని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నీలోఫర్ లో మెరుగైన వైద్యం అందించడంతో పాటు అవినీతికి పాల్పడుతున్న సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆస్పత్రిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని పెంచాలని కోరారు. ప్రతి వార్డులో నిరంతరమైన నిఘాను ఏర్పాటు చేసి అవినీతిని అరికట్టాలన్నారు. బెడ్స్, మూత్ర శాలలను తక్షణం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్, రాజయ్య, అనిల్ తదితరులు పాలొగొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -