అంగన్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి
నవతెలంగాణ – మల్హర్ రావు
బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలని సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి సూచించారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని చిన్నతుండ్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ రాధికారెడ్డి ఆదేశాలతో సూపర్ వైజర్ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడారు బిడ్డ పుట్టిన వెంటనే తల్లి అందించే మొదటి గొప్ప కానుకగా ముర్రుపాలని అభివర్ణించారు. ముర్రు పాలతో పండించడం ద్వారా బిడ్డకి రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. బిడ్డ పుట్టినప్పటి నుండి ఆరు నెలల వయసు వచ్చేవరకు కేవలం తల్లిపాలు ఇవ్వాలని వేరే ఇతర ఆహార పదార్థాలు కానీ, నీళ్లు కానీ ఇవ్వకూడదని ఆరు నెల వరకు ఇచ్చే పాలల్లో బిడ్డకు సరిపడా నీరు, పోషకాలు అన్ని ఉంటాయని చెప్పారు.పిల్లలకు పాలు ఇవ్వడం ద్వారా తల్లి బిడ్డకు అనుబంధం ఏర్పడుతుందని,తల్లులకు రొమ్ము క్యాన్సర్ రాకుండా నిరోధించబడుతుందని,తల్లులు యొక్క బరువు పెరగకుండా ఉంటుందన్నారు.అనంతరం గర్భవతులు,బాలింతలు పాటించాల్సిన పరిశుభ్రత,తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పోషకాహారంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పులిగంటి రామన్న,అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



