Thursday, August 6, 2026
E-PAPER
Homeజిల్లాలుజైలు భరోను జయప్రదం చేయండి 

జైలు భరోను జయప్రదం చేయండి 

- Advertisement -

సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి కురుమూర్తి 
నవతెలంగాణ-మిడ్జిల్ 

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జైలు భరోను జయప్రదం చెయ్యాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, జిల్లా అధ్యక్షులు పోలే జగన్ లు అన్నారు. గురువారం    మండల కేంద్రంలో అంబేద్కర్ భవన్ లో గ్రామపంచాయతీ, ఆశ, అంగన్వాడి, వివోఏలు, హమాలీలు, రైతు, వ్యవసాయ కూలీలుకు ఏర్పాటు చేసిన సమావేశానికి వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బాగీ కృష్ణయ్యా, గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం వెంకటేష్ గౌడ్ సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తెలుగు సత్తయ్య హాజరై ప్రసంగిస్తూ.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తుందనీ, ఎందరో పోరాటయోధుల ప్రాణ త్యాగంతో సాధించుకున్న దేశ స్వతంత్రాన్ని విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతుందని విమర్శించారు.

బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ పెట్టుబడిదారులకు, మతోన్మాదులకు వ్యతిరేకంగా  కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు ప్రజలు ప్రజాతంత్ర వాదులు పోరాడి, భారతదేశాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. దేశవ్యాప్తంగా ఆగస్టు 10న జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివోఏ నాయకులు వెంకటయ్య, గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు జంగయ్య, బాలస్వామి, వెంకటయ్య, యాదయ్య, మాసమ్మ, లక్ష్మమ్మ, లాలమ్మ, అంగన్వాడీ యూనియన్ నాయకులు లీలావతి, నర్మదా, కళావతి, ఆశా యూనియన్ నాయకులు సుజాత, చిన్నమ్మ, బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -