- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ
ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో నిర్వహించే తల్లిపాల వారోత్సవాలను మండల పరిధిలోని చిట్టాపూర్ గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సట్ల గంగా ప్రవీణ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ గర్భిణీలు పౌష్టిక ఆహారాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సాయి, వార్డు సభ్యులు దశరథ్, గంగాధర్, అంగన్వాడి సూపర్వైజర్ రేవతి,అంగన్వాడీ కార్యకర్తలు రేఖ, సంధ్యారాణి, నీలిమ, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



