పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగ రాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో గురువారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘విమానం’ ఫేమ్ శివ ప్రసాద్, ‘రామం రాఘవం’ ఫేమ్ ధనరాజ్, ‘సేవ్ ద టైగర్స్’ ఫేమ్ తేజ కాకుమాను అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ, ‘రామ్ చక్రి వెరీ ఇంటెన్స్ క్రియేటర్. సినిమా చూసి థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా ఈ చిత్రం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ తమ లోన్ ఈఎమ్ఐలను కూడా తక్కువ చేసుకోవాలను కుంటారు. మనపై ఉన్న బరువులను తగ్గించుకుంటేనే.. మన డ్రీమ్స్‌ను నెరవేర్చుకో గలుగుతాం. ప్రతి ఒక్కరూ వెల్త్‌గా ఉంటే కచ్చితంగా గెలుస్తారు అని చెప్పే చిత్రమిది’అని అన్నారు. ‘ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది’ అని దర్శకుడు రామ్ చక్రి నిర్మాత అరుణ్ రంగరాజులు మాట్లాడుతూ,’మా డిస్ట్రిబ్యూషన్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్‌కు స్పెషల్ థ్యాంక్స్’ అని అన్నారు.
అప్పులు తగ్గిస్తే.. ఆనందం
- Advertisement -
- Advertisement -



