ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆఫీస్ బేరర్ల పిలుపు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్యంగా ఉండటం ద్వారా ఉద్యోగ భద్రత సాధించుకుందామనీ, నష్టం లేకుండా విలీనంతో సహ అంగీకరించిన అంశాలు అమలు చేయించాల్సిన అవసరముందని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ( సీఐటీయూ-ఎఐఆర్‌టీడబ్ల్యూఎఫ్) రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం పిలుపునిచ్చింది. గురువారం ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్తిరి కృష్ణ ఆధ్యక్షతన హైదరాబాద్‌లోని రాష్ట్రకార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో గత రెండు నెలలుగా జరిగిన కార్యక్రమాలు, అనుభవాల నివేదికను సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు ప్రవేశ పెట్టారు. ఆఫీస్ బేరర్లంతా చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీఎస్ రావు మాట్లాడుతూ ఆర్టీసీ అధికారుల కమిటీ తో జరిగిన చర్చలలో ఎస్‌డబ్ల్యూఎఫ్ సరైన పాత్ర నిర్వహించిందన్నారు. సంఘం అధ్యయనం ద్వారా అనేక అంశాల్లో సరైన ప్రత్యామ నాయాలను సూచించించినట్టు చెప్పారు. అలాగే అంగీ కరించిన అంశాలు అమలు చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ చేసిన కృషి, ఆందోళనలో భాగంగానే ఉద్యోగ భద్రత పైన కమిటీని ప్రకటించారని వివరించారు. అయితే ఈ కమిటీకి నిర్ధిష్ట గడువు నియమించకపోవడం, కార్మిక సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలని లేకపోవడం, కమిటీ ఇచ్చే సూచనలను కార్మిక సంఘాలకు ఇచ్చి, చివరి అభిప్రాయాలు తీసుకొం టామని ఈడీ కమిటీ చెప్పినది రికార్డులో ఎక్కడా లేక పోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.ఆఫీస్ ఉత్తర్వుల్లో రిఫరెన్స్ లో ఎక్కడా కూడా ఆర్టీసీ సమ్మె విరమణ- ఈడీ కమిటీ చర్చలు గురించి లేకపోవడం యాద్రుచికం కాదన్నారు.
స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా ఆర్టీసీ అధికారులు యూనియన్లను ను గుర్తిం చక పోవడం సరికాదన్నారు. గత 27న ధర్నాలు చేసి వినతిపత్రాలు ఇవ్వడానికి వెళితే తీసుకోవడానికి అనేక మంది డిపో మేనేజర్లు నిరకరించారనీ, తక్షణమే ఆ పరిస్థితిని సమీక్షించి సరిచేయాలని సూచించారు. అంగీకరించిన అంశాలు అమలు చేయాలనీ సంఘం రాష్ట్ర కమిటీ చేసిన కృషి, పోరాటం ఫలించిందన్నారు. ఉద్యోగ భద్రత కమిటీ వేయడం, నెలకు ఇచ్చే మం దులను రెండు నెలలకు ఇచ్చేలా పునరుద్దరించడం, పరీక్ష పాసైన వారికి జూనియర్ అసిస్టెంట్ పోస్టులో ప్రమోషన్ ఇచ్చేలా ఫైల్ క్లియర్ కావడం వంటి ఫలి తాలు వచ్చా యని ఆఫీస్ బేరర్ల సమావేశం అభిప్రా యపడింది. పోరాట కార్యక్రమం జయప్రదం చేసిన అందరికి సమావేశం అభినందనలు తెలియజేసింది. బ్రెడ్ విన్నర్ పథకం కింద రిక్రూట్మెంట్ అయిన వారి రెగ్యు లరైజెషన్, 80 శాతం అలావెన్సుల పెంపు, కొత్త డీఏ అమలు తదితర అంశాలు అన్ని కూడా ఈనెల 12 న జరిగే బోర్డు మీటింగ్లో ఆమోదం తీసుకొని వెంటనే అమ లు చేయాలనీ సమావేశం డిమాండ్ చేసింది. చర్చలు ముగిసి 45 రోజులు గడిచినా ఇంతవరకు ప్రొసీ డింగ్స్ కాపీ ని యూనియన్లకు ఇవ్వకపోవడం సరైంది కాదనీ, తక్షణమే ప్రొసీడింగ్‌లు ఇవ్వాలని సమావేశం కోరింది.
ఐక్యంగా ఉందాం..ఉద్యోగ భద్రత సాధిద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



