Friday, August 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మోడీ–షా ప్రభుత్వానికి ఆలేరులో నిరసన సెగ

మోడీ–షా ప్రభుత్వానికి ఆలేరులో నిరసన సెగ

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్
ప్రధాని మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచార పోరు మొదలైంది. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వీపుల్ గౌడ్ పిలుపుమేరకు శుక్రవారం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో మోడీ–షా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శాంతియుతంగా స్టిక్కర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..దేశంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి పరిరక్షణ కోసం, కేంద్రంలోని మోడీ–షా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ స్టిక్కర్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. యువత, విద్యార్థులు మరియు ప్రజల గొంతుకను అణచివేయలేరని, ప్రజల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి  మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తలారి రాకేష్ యువజన కాంగ్రెస్ నాయకులు బబ్లు, మోసిన్ గంగరాజు శ్రీనివాస్ పాల్గొన్నరు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -