- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం వర్షం మొదలైంది. బాలానగర్, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం దంచికొడుతోంది. ఈ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులపై వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ ఆటంకం ఏర్పడింది. మరో గంటన్నర పాటు నగరంలో వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.
- Advertisement -



