హీరో రవితేజ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 12న భీమవరంలో జరిగే భారీ కార్యక్రమంలో ‘ఇరుముడి’ ట్రైలర్ విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి రవితేజ స్వయంగా హాజరుకా నుండటంతో, ఇది సినిమా ప్రచారంలో ఒక కీలక ఘట్టం కానుంది. ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ రెండు విభిన్న అవతారాల్లో కనిపిస్తున్నారు. ఒకవైపు నోటిలో గొడ్డలితో మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, మరోవైపు అయ్యప్ప మాల ధరించిన ఆధ్యాత్మిక అవతార్ లో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో సినిమా కథలోని భావోద్వేగ, ఆధ్యాత్మిక అంశాలనే ఎక్కువగా ప్రజెంట్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ ద్వారా రవితేజ పాత్ర ఏమిటి? ఇతర కీలక పాత్రలతో ఆయన సంబంధం ఎలా ఉంటుంది? అసలు కథను నడిపించే పరిస్థితులు ఏమిటి? అనే విషయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో శివ నిర్వాణ భావోద్వేగాలతో పాటు కమర్షియల్ అంశాలను ఎలా మిళితం చేశారో కూడా ట్రైలర్ ప్రజెంట్ చేయనుంది.
ఈ చిత్రంలో ప్రియ భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాహి సురేశ్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
భీమవరంలో ట్రెలర్ లాంచ్
- Advertisement -
- Advertisement -



