- Advertisement -
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆషాడమాస బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని మీరాలం మండిలోని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆదివారం పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ చైర్మెన్ గాజుల అంజయ్య, సభ్యులు, వేద అర్చకులు స్థానిక నాయకులు స్పీకర్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్పీకర్ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలనీ, వర్షాలు బాగా కురిసి గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పంటలు సమృద్ధిగా పండాలని ఆయన ఆకాంక్షించారు.
- Advertisement -



