Monday, August 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మికుల పట్ల ఉరితాడులా ఉన్న చట్టాలను వెంటనే ఎత్తేయాలి: కేవీపీఎస్

కార్మికుల పట్ల ఉరితాడులా ఉన్న చట్టాలను వెంటనే ఎత్తేయాలి: కేవీపీఎస్

- Advertisement -

నవతెలంగాణ-రాజోలి
కార్మికులకు ఉరితాడులా ఉన్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తేయాలని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు విజయకుమార్ అన్నారు. సోమవారం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జైల్ భరో కార్యక్రమాన్ని కెవిపిఎస్ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ సెంటర్లో విజయకుమార్ మాట్లాడుతూ.. మనదేశ రైతులు నష్టపోయేలా అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులు నష్టపోయే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనీ, పంట గిట్టుబాటు ధర చట్టం తేవాలనీ, వీబీజీ రాంజీని తొలగించి పాత ఉపాధి హామీ చట్టాన్ని అమల్లోకి తేవాలనీ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఆపాలనీ, గ్రామాల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత పెంచాలనీ, ప్రభుత్వాస్పత్రులలతో నాణ్యమైన వైద్యం అందించాలనీ చెప్పారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త మద్దూర్ గోవర్ధన్ రెడ్డి, తుమ్మలపల్లె గోపాల్ రెడ్డి, సిఐటియు మండల కన్వీనర్ డి లక్ష్మన్న, కార్మికులు నడపన్న మైబు, మహేష్, సంజన, దస్తగిరి, నరసన్న, మద్దిలేటి, ఆటో యూనియన్ నాయకులు గోకారి దొరబాబు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -