- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని మోహిదిన్ సబ్ తండా పంచాయతీలో సోమవారం వనసంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమములో సర్పంచ్ మాలవత్ బాలు నాయక్ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు చెట్లు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమములో ఉప సర్పంచ్ లక్ష్మణ్, వార్డు సభ్యులు హరిలాల్, మోతి లాల్, రవి,జీవరత్నం, కడవత్ జమున గ్రామ పిసి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



