Monday, August 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాభివృద్ధికి వేగం..ఫార్మ్ పాండ్స్ నిర్మాణానికి శ్రీకారం

గ్రామాభివృద్ధికి వేగం..ఫార్మ్ పాండ్స్ నిర్మాణానికి శ్రీకారం

- Advertisement -

నవతెలంగాణ–ఆలేరు రూరల్
ఆలేరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ శుక్రవారం శ్రీనివాసపురం, పటేల్‌గూడెం గ్రామాలను సందర్శించి జలసిరి కార్యక్రమం అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో రెండు ఫార్మ్ పాండ్స్ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేయడంలో భాగంగా సంబంధిత సర్పంచ్‌లతో కలిసి పనులకు శ్రీకారం చుట్టి, నిర్మాణ స్థలాలను మార్కింగ్ చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆలేరు మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామానికి రెండు చొప్పున ఫార్మ్ పాండ్స్ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.భూగర్భ జలాలను పెంపొందించడం, వర్షపు నీటిని సంరక్షించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.పనులను వేగవంతంగా పూర్తిచేసి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించేలా సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న మొక్కల నాటకం (ఫిట్టింగ్ ప్లాంటింగ్) పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను పూర్తిచేసి,నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామాల్లో చేపడుతున్న సోక్‌పిట్ల నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతా ప్రమాణాలను పాటించి వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు.ఈ సందర్భంగా గ్రామస్తులకు ఎల్-నినో ప్రభావం,వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే పరిస్థితులు,వర్షపాతం తగ్గుదల, నీటి సంరక్షణ అవసరం, రైతులు మరియు ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు,గ్రామ పంచాయతీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్లు,మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -