- Advertisement -
అంతక్రియలకు రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేసిన పాలకవర్గం
నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని దుబ్బాక గ్రామ పంచాయతీ కార్మికుడు వెంకట్ అనారోగ్యంతో సోమవారం మృత్తి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సరోజినీ దేవి, ఉపసర్పంచ్ అంత్యక్రియల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా మృతుడి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందించారు. అన్నంతరం వారు మాట్లాడుతూ..మృతుని కుతురు పేరున మరో రూ.50 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ పాలక వర్గం తీర్మానించిందని అన్నారు. కార్యక్రమములో వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
- Advertisement -



