నవతెలంగాణ-హైదరాబాద్: రేపు ఆకాశంలో సూర్యగ్రహణం సంభవించనుంది. బుధవారం రాత్రి 9:04 గంటలకు గ్రహణం ప్రారంభమై, రాత్రి 11:16 గంటలకు గరిష్ఠ దశకు చేరుకుని, ఆగస్టు 13 తెల్లవారుజామున 1:27 గంటలకు ముగియనుందని శాస్త్రవేత్తల అంచనా. NASA ప్రకారం ఈసారి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల భారతదేశంలో దీన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉండదు. గ్రీన్‌ల్యాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, యూరప్‌లోని అనేక ప్రాంతాలు, ఉత్తర అమెరికా, వాయవ్య ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే, 2026 ఆగస్టు 12న ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణం ప్రపంచంలోని పలు ప్రాంతాలకు అరుదైన ఖగోళ దృశ్యాన్ని అందించనుంది.
ఆగస్టు 12న సూర్యగ్రహణం.. సమయం ఇదే
భారత కాలమానం ప్రకారం ఆగస్టు 12న రాత్రి 9:04 గంటలకు గ్రహణం ప్రారంభమై, రాత్రి 11:16 గంటలకు గరిష్ఠ దశకు చేరుకుని, ఆగస్టు 13 తెల్లవారుజామున 1:27 గంటలకు ముగుస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నాయి. అయితే గ్రహణం జరిగే ప్రదేశాన్ని బట్టి స్థానిక సమయాలు మారుతాయి. NASA వివరాల ప్రకారం వివిధ ప్రాంతాల్లో గ్రహణం సాయంత్రం లేదా రాత్రి సమయంలో కనిపించనుంది.



