కేటీఆర్ ఆరోపణల్లో నిజం లేదు :
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సోదరులకు భూములను కేటాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ టెసరాట్ సంస్థతో వారికి సంబంధం లేదని పేర్కొన్నారు. పరిశ్రమలు, కంపెనీలకు బీఆర్ఎస్ హయాంలో ఎకరానికి రూ,90 లక్షలు ఇస్తే, తమ ప్రభుత్వం రూ.1.5 కోట్లకు ఇచ్చిందన్నారు. ‘‘32 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో ఒకటి టెసరాట్ కంపెని. బోర్డు డిసైడ్ చేసిన దానికంటే రూపాయి కూడా తక్కువకు ఇవ్వలేదు. కంపెనీ నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయి. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఆరోపణలు చేయడం తగదు. 5 ఎకరాల్లో రూ.34 కోట్లతో ఏర్పాటయ్యే కంపెనీని రూ.200 కోట్ల సంస్థగా కేటీఆర్ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది’ అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో తక్కువ ధరకు భూములు ఎందుకిచ్చారో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పీఎం ఏక్తామాల్ టెండర్లు పారదర్శకంగా జరిగాయని అన్నారు. ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్ రూల్స్ ప్రకారం మాల్ నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రీ బిడ్డింగ్‌లో 7 గురు బిల్డర్లు పాల్గొంటే, ఇద్దరిని ఎంపిక చేసారని గుర్తు చేశారు. పరిశ్రమలు రావొద్దనే హిడెన్ ఏజెండాతో కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తన శాఖలో ఎవరో చెప్తే పనిచేసే రకం కాదనీ, ప్రతీ నిర్ణయం నాకు తెలిసే జరుగుతుందని శ్రీధర్‌బాబు అన్నారు. గత సర్కార్ హయాంలో జరిగిన భూ కేటాయింపుల విచారణ చేయిస్తామని శ్రీధర్‌బాబు ప్రకటించారు.
సీఎం సోదరులకు భూ కేటాయింపులు అవాస్తవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



