మండల అధ్యక్షులు భాస్కర్
నవతెలంగాణ-మిడ్జిల్
మండలంలోని రాణి పేట గ్రామానికి చెందిన అరవింద్ అకాల మరణం కుటుంబానికి తీరనిలోటని, కుటుంబానికి మండల విశ్వకర్మ నాయకులు అండగా ఉంటామని విశ్వకర్మ మండల అధ్యక్షులు భాస్కరాచారి అన్నారు. ఇటీవల మరణించిన అరవిందు కుటుంబాన్ని విశ్వకర్మ మండల కమిటీ ఆధ్వర్యంలో పరామర్శించి, రూ. 5 వేలు సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అరవింద్ మరణం చాలా బాధాకరమైందనీ, ఆపద సమయంలో ఆ కుటుంబానికి సంఘం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా అధైర్యపడవద్దని ఓదార్చారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ జయంతి నిర్వాహక అధ్యక్షులు దశరథం చారి, ఉపాధ్యక్షులు నవీన్ చారి, శేఖర్ చారి, లక్షణ చారీ , ఆదిత్య చారి, రాఘవేంద్ర చారీ, ఆంజనేయులు చారి, తదితరులు పాల్గొన్నారు.
అరవింద్ కుటుంబానికి అండగా ఉంటాం
- Advertisement -
- Advertisement -



