రేషన్‌కార్డుల అసలు లక్ష్యం ఆహారభద్రత. కానీ ప్రజలకు అవి పూర్తిస్థాయి ప్రయోజనాన్ని అందించలేక పోతున్నాయి. ఆ కార్డును ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హతగా పరిగణించడం దాని అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పాలక పార్టీలు అధికార కాంక్షలకు ఆ కార్డులను ఆయుధంగా వాడుకుంటున్నాయి. ఓట్లు, సీట్ల రాజకీయాల చేస్తూ కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రాయితీలిస్తున్నాయి. నిరుపేదలకొచ్చేసరికి లెక్కలు కడుతున్నాయి. అంతేగాక ఉచితాల పేర పథకాలను ఎత్తేసే కుట్రలూ చేస్తున్నాయి. కొత్త పథకాల సంగతి పక్కనబెడితే, ఉన్నవి ఊడపీకే పరిస్థితులను కల్పి స్తున్నాయి. రేషన్‌కార్డుల ద్వారా కనీస సరుకులు ఇవ్వాల్సిందిపోయి, బియ్యమొక్కటేనన్న దుస్థితికి లబ్దిదారులను నెట్టేశాయి. తెలంగాణలో 2014 తర్వాత కొత్త రేషన్ కార్డులివ్వలేదు. నూత నంగా పెండ్లి చేసుకున్న వారికి, వలసెళ్లిన వారికి కార్డులు మం జూరు కావడం లేదు. చిన్న చిన్న కారణాలతో ఉన్న కార్డులను రద్దుచేసే పరిస్థితి నెలకొంది. అన్నీ సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు ప్రాథమిక కెవైసీగా మారింది. కొత్తగా తెల్ల రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15న సంగారెడ్డిలో చేపట్టనుంది.
వీటిని కొత్తగా ఇవ్వడం లేదు. కార్డుల సంఖ్యను పెంచితే సరిపోతుందనే భావనలో ప్రభుత్వం ఉంది. అదే గొప్పగా అన్నట్టుగా వ్యవ హరిస్తున్నది. ఈ కార్డులతో ఉపయోగం అంతంత మాత్రమే. నిరుపేదల కనీసావసరాలనూ తీర్చడం లేదు. ఆయా ప్రభుత్వాలు వీటిని దశలవారీగా నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయి. గతంలో ఇచ్చిన సరుకులేవి లబ్దిదారులకు నేడు అందడం లేదు. దారిద్య్రరేఖ దిగువనున్న వారికి రేషన్‌కార్డులను ఎర వేయడం ద్వారా ఎన్నికల రాజకీయాలను గట్టెక్కే ప్రయత్నమే ఎక్కువగా జరుగుతున్నది. ఆ ఇచ్చే కార్డులతో ప్రజలకు ఎంతమేరకు మేలు జరుగుతున్నది ? ఏ తరహా ప్రయోజనం ఒనగూరుతున్నదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఒట్టి బియ్యమిచ్చి అదే పదివేలు అన్నచందంగా మార్చే శారు. ఉమ్మడి రాష్ట్రంలో బియ్యంతోపాటు కంది, గోధుమలు, పామా యిల్, ఉప్పు, చక్కెర, చింత పండు, కారం, పసుపు తదితర తొమ్మిది రకాల వస్తువులకు నిరుపేదలకు చేరేవి. అప్పట్లో కిరోసిన్ సైతం సరఫరా జరిగేది. అనక గులాబీ సర్కారు కాస్త సంచిని మొత్తం ఖాళీ చేసేసింది. పూర్తిగా బియ్యంతో నింపేసింది. దీంతో సామాన్యులు పౌష్టికా హార లోపాన్ని తీవ్రంగా ఎదుర్కొవాల్సి వస్తున్నది. ప్రధానంగా పిల్లలు, మహి ళలు, రక్తహినతకు లోనై అనారోగ్యం పాలవు తున్నారు. అది ఏకంగా జాతీయ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన బరువును కోల్పోయే దుస్థితికి కారణమైంది. మానసీక, శారీరక ఎదుగుదలా మందగిస్తున్నది. కోటికిపైగా రేషన్కార్డులి స్తున్నామంటూ గొప్పలుపోతున్న సర్కారు, అమ్మహస్తం సంచిని తిరిగి నింపి నిరుపేదలకు పంచుతుందా? లేదా? అనే సంగతిని పంద్రాగస్టున జరిగే సంగారెడ్డి సభలో ప్రకటించాలి. అంతకుముందు రోజున జరిగే రాష్ట్ర క్యాబి నెట్నూ చర్చించాలి. వామపక్ష సర్కార్ కేరళలో అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు రకాల సరుకులను అందించింది. అక్కడ అమలు చేసిన విధానాన్ని తెలుసుకోవాలి.
పేరుకు కార్డులిచ్చి ‘తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి’ అంటే సరిపోదు. రాష్ర్టాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్న ముఖ్యమంత్రి, మంత్రుల హామీలు ఆచరణలో రుజువు చేయాలి. రాజకీయ భావోద్వేగాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, తన మ్యానిఫెస్టోను మననం చేసుకోవాలి. ఆ దిశగా సర్కారును నడిపించాలి. రాజకీయ పక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం. ఉండాలి కూడా. లేకపోతే భావాల ఘర్షణ జరగదు. పాలన రోటీన్‌గా సాగి ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. బహిరంగ మార్కెట్‌ను చూస్తే భారాలమయంగా మారింది. సర్కారీ రేషన్‌షాపులు, సూపర్బజార్లలో సరుకులు నిండుకుం టున్నాయి. ప్రతిమనిషికి నెలా నెలా ఆరుకిలోల బియ్యం ఇస్తే సరిపోతుందా? అనేది ఆలోచించాలి. అన్నం పెట్టినోళ్లు, మిగతా వాటి గురించి ఎందుకు పట్టించుకోరు? కోవిడ్ సమయంలో కీలకపాత్ర పోషించిన రేషన్డీలర్లను నామమాత్రం చేశారు. నేడు రేషన్‌కార్డు ఒక ‘మాస్టర్ కీ’గా మారి పోయింది. కార్డు లేకపోతే ఆరోగ్యశ్రీ లేదు, పెన్షన్ లేదు, ఇల్లూ లేదు. సర్కార్ రకరకాల సరుకులివ్వడం ద్వారా రేషన్‌కార్డును బలోపేతం చేస్తేనే నిరుపేద కడుపు నిండుతుంది. ఈ విషయాన్ని పాలకులు గుర్తెరగాలి. ఆదిశగా కార్యా చరణ చేపట్టాలి. లేదంటే భవిష్యత్తులో రేషన్ కార్డు అంటే పథకాలకు లబ్దిదారులను గుర్తించడానికేనని అనుకోవాల్సి వస్తుంది.
రేషన్‌కార్డుల లక్ష్యమేంటి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



