Thursday, August 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణి ఫిర్యాదుపై మేడిపల్లి జీపీలో ఎంపీఓ విచారణ

ప్రజావాణి ఫిర్యాదుపై మేడిపల్లి జీపీలో ఎంపీఓ విచారణ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం మండలం మేడిపల్లి గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో పిటిషన్ దారుడు అప్పాల భూమేష్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. గురువారం ఎంపీఓ ఉమాదేవి గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. పంచాయతీకి సంబంధించిన అన్ని రికార్డులను సీజ్ చేశారు. నిధుల మంజూరు, ఖర్చులు, బిల్లులు, వౌచర్లు, తీర్మానాలు, అభివృద్ధి పనులు, చెల్లింపులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పంచాయతీకి వచ్చిన నిధులు ఏ పనులకు కేటాయించారు.?ఎంత మొత్తం ఖర్చు చేశారు.? రికార్డుల్లో చూపిన పనులు క్షేత్రస్థాయిలో జరిగాయా పనులకు సంబంధించిన బిల్లులు, వౌచర్లు, కొలతల వివరాలు సక్రమంగా ఉన్నాయా అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సి ఉందని ఎంపిఓ తెలిపారు.

నిధుల ఖర్చుకు సంబంధించి పంచాయతీ తీర్మానాలు, అనుమతులు, వర్క్‌ఆర్డర్లు, పనుల అంచనాలు, చెల్లింపుల వివరాలు పరిశీలిస్తే నిధుల వినియోగంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఫిర్యాదు దారుడు మాట్లాడుతూ.. ప్రజాధనానికి సంబంధించిన అంశం కావడంతో ప్రాథమిక విచారణతో సరిపెట్టకుండా జిల్లా స్థాయి అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సీజ్ చేసిన అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, నిధుల వినియోగంలో అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణను పారదర్శకంగా నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుతో అధికారులు విచారణకు దిగడం, అన్ని రికార్డులు సీజ్ చేయడం నేపథ్యంలో మేడిపల్లి పంచాయతీ నిధుల వ్యవహారంలో తదుపరి పరిణామాలపై గ్రామ ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -