– సంఘం జిల్లా కార్యదర్శి కాట్రాల తిరుపతిరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
గొర్రెల సహకార సంఘాలకు జీవాల మేత కోసం 20 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి కాట్రాల తిరుపతిరావు డిమాండ్ చేశారు. శుక్రవారం అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి గ్రామంలో నిర్వహించిన గొర్రెల కాపరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 20 న సుజాతనగర్లో నిర్వహించనున్న సంఘం జిల్లా 4 వ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. అశ్వారావుపేట మండలంలోని గొర్రెల కాపరులు అధిక సంఖ్యలో హాజరై మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
గొర్రెల కాపరి ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, గొర్రెలు, మేకలకు సరైన మార్కెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గొర్రెల కాపరుల్లోని చదువుకున్న నిరుద్యోగ యువతకు గొర్రెల ఫారాల ఏర్పాటుకు రూ.30 లక్షల వరకు రుణాలు అందించాలని కోరారు. అర్హులైన గొర్రెల కాపరులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, 559, 1016 జీవోలను పటిష్టంగా అమలు చేసి మేతకు అవసరమైన వనరులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జంగిలి వెంకటరత్నం, పుచ్చుకాయల లక్ష్మణ్‌రావు, నక్కనబోయిన రమేష్, గొసుల రాంబాబు, నక్కనబోయిన రాజు, చల్లా వీరబాబు, చల్లా నాగేశ్వరరావు, నక్కనబోయిన వర్ధయ్య, సాదం రామకృష్ణ, సాయిల వీరబాబు, ఎలక భాస్కర్, సాని నాగు శ్రీను, సాధన వీరయ్య, సాయిల ఈశ్వరయ్య, సాయిలు వీరభద్రం, సాధన ప్రసాద్, ఏసు, కంపసాటి శేషు, మరలపాటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.



