Friday, August 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కృష్ణవేణి పాఠశాలలో మాక్ ఎలక్షన్ 

కృష్ణవేణి పాఠశాలలో మాక్ ఎలక్షన్ 

- Advertisement -

ఓటింగ్ ప్రక్రియ పై విద్యార్థులకు అవగాహన 
నవతెలంగాణ-బాల్కొండ 

మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థిని, విద్యార్థులకు మాక్ ఎలక్షన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఓటింగ్ ప్రక్రియ గురించి ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులను ఉపాధ్యయ బృందం అభినందించారు.అనంతరం విద్యార్థుల పురోగతిపై పేరెంట్,ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల పురోగతి కార్డులను తల్లి దండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు విఘ్నేశ్వర్, ఆకుల లక్ష్మణ్, ప్రిన్సిపాల్ విజయ్ కర్తన్ పాల్గొనారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -