Friday, August 14, 2026
E-PAPER
Homeబీజినెస్మహీంద్రా యూనివర్సిటీ సెమీకండక్టర్ రెండో హ్యాకర్ ఫ్యాబ్

మహీంద్రా యూనివర్సిటీ సెమీకండక్టర్ రెండో హ్యాకర్ ఫ్యాబ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహీంద్రా యూనివర్సిటీ ఈరోజు భారతదేశంలో రెండో హ్యాకర్ ఫ్యాబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇది ఐ ఐ టి బాంబేలో విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటైన హ్యాకర్ ఫ్యాబ్ తర్వాత దేశంలో రెండోది కాగా, పూర్తిగా యూనివర్సిటీ ఆధ్వర్యంలో, విద్యార్థుల నేతృత్వంలో నడిచే తొలి ఓపెన్-సోర్స్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ సదుపాయం కానుంది. ఈ కార్యక్రమం భారతదేశ సెమీకండక్టర్ లక్ష్యాలకు, అలాగే ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు యూనివర్సిటీ అందిస్తున్న సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

తక్కువ ఖర్చుతో కూడిన ఫ్యాబ్రికేషన్ పరికరాలను విద్యార్థులే రూపొందించి అభివృద్ధి చేసేలా ప్రోత్సహించడం ద్వారా, సెమీకండక్టర్ తయారీ రంగంలో దేశీయ నైపుణ్యాలు మరియు సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ఓపెన్-సోర్స్ హ్యాకర్ ఫ్యాబ్ నమూనా ఆధారంగా రూపొందుతున్న ఈ సదుపాయం విద్యార్థులకు సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్‌పై ప్రాక్టికల్ అనుభవాన్ని అందించడంతో పాటు, ఈ వ్యూహాత్మకంగా కీలకమైన రంగంలో భారతదేశ ప్రతిభా వనరులను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

యూనివర్సిటీకి చెందిన బి టెక్ . ఐ యెన్ వి ఎల్ ఎస్ ఐ డిసైన్ టెక్నాలజీ ప్రోగ్రామ్ విద్యార్థుల నేతృత్వంలో హ్యాకర్ ఫ్యాబ్ పనిచేయనుంది. ఇందులో మాస్క్‌లెస్ ఫోటోలిథోగ్రఫీ సిస్టమ్, ఆర్ ఎఫ్ స్పట్టరింగ్ ఛాంబర్, స్పిన్ కోటర్, ట్యూబ్ ఫర్నేస్ వంటి కీలక సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ పరికరాల తయారీపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ ప్రాక్టికల్ విధానం, బోధన పరిశోధన కోసం క్లీన్‌రూమ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలన్న మహీంద్రా యూనివర్సిటీ ప్రణాళికలకు అనుసంధానంగా ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులకు చిప్ డిజైన్‌తో పాటు ఫ్యాబ్రికేషన్‌పై కూడా ప్రత్యక్ష అవగాహన లభిస్తుంది.

మహీంద్రా గ్రూప్ చైర్మన్, మహీంద్రా యూనివర్సిటీ ఛాన్సలర్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ, “ప్రతి గొప్ప భారతీయ ఆవిష్కరణ వెనుక, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి దాన్ని విప్పి చూసిన ఒక వ్యక్తి ఉంటాడు. హ్యాకర్ ఫ్యాబ్ విద్యార్థులకు అదే చేయడానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది. తప్పులు చేయడానికి, వాటిని సరిదిద్దడానికి, మళ్లీ ప్రయత్నించడానికి ఎలాంటి అనుమతి అవసరం లేకుండా. ఇలా నిర్మించడంలో భయపడని ఒక తరాన్ని తీర్చిదిద్దవచ్చు. మహీంద్రా యూనివర్సిటీ నిర్మించడంలో సహాయపడాలని నేను కోరుకునే భారతదేశం ఇదే.” అని అన్నారు.

మహీంద్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. యజులు మెదురి మాట్లాడుతూ, “భారతదేశ సెమీకండక్టర్ లక్ష్యాలను సాధించడానికి డిజైన్‌తో పాటు ఫ్యాబ్రికేషన్‌పై కూడా ప్రాక్టికల్ అవగాహన ఉన్న ఇంజనీర్లు అవసరం. హ్యాకర్ ఫ్యాబ్ ద్వారా విద్యార్థులు ల్యాబ్‌లోనే పరికరాలను నిర్మించి, ఆలోచనలను పరీక్షించి, ఫ్యాబ్రికేషన్ ప్రక్రియను ప్రత్యక్షంగా అర్థం చేసుకుంటారు. మా వీ ఎల్ ఎస్ ఐ ప్రోగ్రామ్‌లు ప్రతిపాదిత క్లీన్‌రూమ్‌తో కలిసి, భారతదేశానికి పరిశ్రమ అవసరాలకు సిద్ధంగా ఉన్న సెమీకండక్టర్ ప్రతిభను అభివృద్ధి చేయడంపై మా దృష్టిని ఇది మరింత బలోపేతం చేస్తుంది.” అని తెలిపారు.

హ్యాకర్ ఫ్యాబ్ కేర్ ఫ్యాబ్ ను కార్నెజి మెలోన్ యూనివర్సిటీ లోని డిపార్ట్మెంట్ అఫ్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ 2023లో ఓపెన్-సోర్స్ కార్యక్రమంగా ప్రారంభించింది. తక్కువ ఖర్చుతో విద్యార్థులే నిర్మించే పరికరాల ద్వారా సెమీకండక్టర్ మైక్రోఫ్యాబ్రికేషన్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యం. అనంతరం ఈ నమూనాను అంతర్జాతీయంగా, అలాగే భారతదేశంలోని పలు విద్యాసంస్థలు స్వీకరించాయి.

ఐ ఐ టి బాంబే విద్యార్థులు ఆగస్టు 2025లో భారతదేశపు తొలి విద్యార్థుల నిర్మిత హ్యాకర్ ఫ్యాబ్ ను ప్రారంభించారు. సెమీకండక్టర్ తయారీలో ఉపయోగించే మాస్క్‌లెస్ లిథోగ్రఫీ, స్పిన్ కోటింగ్, స్పట్టరింగ్ ఫర్నేస్ సిస్టమ్స్ వంటి పరికరాల ప్రోటోటైప్‌లను వారు క్యాంపస్‌లోనే అభివృద్ధి చేశారు. దీని ద్వారా అండర్‌గ్రాడ్యుయేట్ ఇంజనీర్లకు సెమీకండక్టర్ ఫ్యాబ్‌లలో ఉపయోగించే ప్రక్రియలు, వ్యవస్థలపై ప్రాక్టికల్ అనుభవం లభించింది.

సెమీకండక్టర్ విద్యలో మహీంద్రా యూనివర్సిటీ చేస్తున్న పెట్టుబడులను ఈ కార్యక్రమం మరింత విస్తరిస్తుంది. భారత ప్రభుత్వ సెమీకండక్టర్ ప్రాధాన్యతలకు అనుగుణంగా యూనివర్సిటీ 2023లో ఏం టెక్ వి ఎల్ ఎస్ ఐ ఎమ్ బే డెడ్ సిస్టం , అనంతరం 2024లో బి టెక్ వి ఎల్ ఎస్ ఐ డిసైన్ టెక్నాలజీ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది. విద్యార్థులకు సైనోప్సీస్, కాడెన్సు ఈ డి ఏ సూట్లు వంటి పరిశ్రమ ప్రమాణాల సాఫ్ట్‌వేర్ టూల్స్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు ఏ ఎమ్ డి సిలికాన్ లాబ్స్ నుంచి హార్డ్‌వేర్ సహకారం కూడా అందుబాటులో ఉంది.

హ్యాకర్ ఫ్యాబ్ ద్వారా మహీంద్రా యూనివర్సిటీ సెమీకండక్టర్ డిజైన్, ఫ్యాబ్రికేషన్ పరిశోధనలను మరింత దగ్గరగా అనుసంధానిస్తోంది. భారతదేశం తన దేశీయ సెమీకండక్టర్ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటున్న నేపథ్యంలో, దేశ సాంకేతిక స్వావలంబనకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ప్రాక్టికల్ అనుభవం కలిగిన ఇంజనీర్లను తయారు చేయడంపై యూనివర్సిటీ తన దృష్టిని కొనసాగించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -