Saturday, August 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభిన్న ఎమోషనల్‌ థ్రిల్లర్‌

భిన్న ఎమోషనల్‌ థ్రిల్లర్‌

- Advertisement -

కన్నడ చిత్ర పరిశ్రమలో ‘సుప్రీమ్ స్టార్’గా పేరు తెచ్చుకున్న భార్గవ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’. మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్ హీరోయిన్స్. తెలుగు, కన్నడ భాషల్లో కొసల క్రియేటివ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రొడ్యూసర్ బండి నాగరాజు నిర్మిస్తున్నారు. భార్గవ్ బి. వి. దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్ర ప్రారం భోత్సవం ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశా నికి నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు క్లాప్ ఇవ్వగా, ఫిలింఛాంబర్ సెక్రటరీ కె. అశోక్ కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు దశరథ్ తొలి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ వీరశంకర్ స్క్రిప్ట్ అందజేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మద్దినేని రమేష్ మాట్లాడుతూ, ‘హైదరాబాద్, బెంగళూరులో షూటింగ్ జరపబోతు న్నాం. అక్టోబర్ కల్లా చిత్రీకరణ పూర్తి చేసి, రిలీజ్ చేస్తాం’ అని తెలిపారు. ‘ఒక మంచి కథతో మా సినిమాను నిర్మిస్తున్నాం. మా సినిమాకు రోహిత్ నాలుగు మంచి సాంగ్స్ ఇచ్చారు’ అని ప్రొడ్యూసర్ బండి నాగరాజు చెప్పారు. హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ మాట్లాడుతూ,‘ఇందులో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని తెలిపారు. ‘ఈ చిత్రంతో తెలుగులో నా కెరీర్ స్టార్ట్ అవుతోంది. నాగరాజు సినిమా పట్ల ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ సీన్స్ తో పాటు, సీట్స్ లో నుంచి ఎగిరి డ్యాన్సులు చేసే ఐటెం సాంగ్ మా మూవీలో చూస్తారు’ అని హీరో, డైరెక్టర్ భార్గవ్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -