నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన సినిమాలు చేసి తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాందించుకున్న లెజెండరీ నటుడు రియల్‌స్టార్ డా. శ్రీహరి. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన మేఘాంశ్ శ్రీహరి హీరోగా భైరవకాళి బ్యానర్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. రోహిత్ దర్శకత్వంలో లెల్లా రాహుల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన పోతురాజు ఆహార్యంలో ఉన్న హీరో ఫస్ట్ లుక్‌ని నేడు (శనివారం) శ్రీహరి పుట్టినరోజు సందర్బంగా చిత్ర బృందం విడుదల చేసింది. తనయుడు మేఘాంశ్ శ్రీహరికి అండగా వెనుక పోతురాజు ఆహార్యంలో రియల్‌స్టార్ డా. శ్రీహరికి కూడా కనిపిస్తుండటంతో ఈ లుక్ మరింత పవర్‌ఫుల్‌గా మారింది. ఈ సినిమాకి సంబంధించి 50 శాతం షూటింగ్ పూర్తయింది.
తనయుడు మేఘాంశ్ శ్రీహరికి అండగా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



