దర్శకుడు దేవ కట్టా సమర్పణలో రూపొందనున్న రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం ‘జో జో’. ప్రేమ, కొత్త జీవితంపై ఆశలు, జీవి తంలో ఎదగాలనే తపన.. మెరుగైన జీవితం కోసం మనుషులు ఎంత దూర మైన వెళ్లే తీరుని వ్యంగ్య హాస్యంతో ‘జో జో’ చిత్రంలో ఆవిష్కరించ బోతున్నారు. శుక్రవారం మేకర్స్ టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. జొన్నగిరి ప్రాం తపు ల్యాండ్‌స్కేప్‌ను బ్యాక్‌డ్రాప్ గా చూపిస్తూ, పోస్టర్లో ప్రధాన పాత్రను ప్రత్యేకంగా హైలైట్ చేశారు. అలాగే “హెచ్చరిక: మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి!” అంటూ సరదాగా ఇచ్చిన వార్నింగ్‌తో సినిమాకు ఉన్న డిఫరెంట్ కామెడీ టోన్‌ను మేకర్స్ స్పష్టం చేశారు. కృష్ణ కమల్, మాహి శ్రీ, ఫణీంద్ర దేవరపల్లి, ప్రభావతి, మహబూబ్ బాషా, సతీష్ దేవట్టే తంజోర్, పూడూరు శరత్ బాబు, మకరంద్ దేశ్‌పాండే తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి బ్యానర్: విజయం, సమర్పణ: దేవ కట్టా, నిర్మాత: విజయ్ కృష్ణ లింగమనేని, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: కిరణ్ జయ్ కుమార్, సినిమాటోగ్రఫీ: రోహిత్ కుమార్, సంగీతం: మహేష్ శంకర్, ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్ళపల్లి, పాటలు: రెహమాన్, శ్రీనివాస్ మౌళి, రామచంద్ర.
దర్శకుడు దేవ కట్టా సమర్పణలో ‘జో జో’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



