Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ గ్రామపంచాయతీగా మాన్ దొడ్డి

ఉత్తమ గ్రామపంచాయతీగా మాన్ దొడ్డి

- Advertisement -

నవతెలంగాణ-రాజోలి
గద్వాల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు ఉత్తమ అభివృద్ధి పంచాయతీలుగా ఎన్నికయ్యాయి. రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామం ఉత్తమ గ్రామ పంచాయితీగా ఎన్నికైయింది. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాష, ఎమ్మెల్యే  విజేయుడు, మాజీ చైర్ పర్సన్ సరిత చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రాన్ని సర్పంచ్ జి. సుజాత బాబురావు, పంచాయతీ కార్యదర్శి వీరేష్ లు సంయుక్తంగా అందుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మాన్ దొడ్డి గ్రామం జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గ్రామ పెద్దలు, ప్రజలు, యువకులు, మహిళల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చెందే విధంగా నా వంతు కృషి చేస్తానని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -