- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని హంగర్గ గ్రామంలో సన్ షైన్ పాఠశాల కన్వీనర్ శివ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో 80వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని ఉపాధ్యాయ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆనందంగా నిర్వహించారు. జెండా ఎగురవేసిన తర్వాత విద్యార్థులు జాతీయ స్వాతంత్రం సాధించి పెట్టిన నాయకుల వివిధ రకాల వేషధారణలు చూపరులకు మంత్రముగ్ధులు చేసింది. గ్రామాలలో ర్యాలీ నిర్వహించి దేశ ఔన్నత్యాన్ని చాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



