నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో రాజ్యాంగ బద్ధంగా వర్కింగ్ జర్నలిస్టుల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియను ప్రజాస్వామ్య బద్ధంగా పూర్తి చేయగా.. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎన్నికల్లో గౌరవ అధ్యక్షులుగా జూల శ్రీధర్, పి. మాధవరెడ్డి, అధ్యక్షుడిగా దడిగే రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎలుగల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా సిరిగిరి స్వామి, ఉపాధ్యక్షులుగా ఆరె నరేష్, బోడ నరేష్, దూడల సాగర్, కోశాధికారిగా గంగదారి శ్రావణ్ కుమార్, సహాయ కార్యదర్శులుగా కొంతం సిద్ధార్థ, ఎలుగల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శులుగా ఆరే భాను ప్రసాద్, కాసగళ్ల మహేందర్, గౌరవ సలహాదారులుగా ఎర్ర జాన్సన్, హనుమకొండ ఉపేంద్ర చారి, మల్లిగారి శ్రీను ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా జూకంటి అనిల్, దాసి శంకర్, షానూర్ బాబా, వంగరి శివకుమార్, జూకంటి బీరప్ప, దడిగే అనిల్, బైరీ విశ్వనాథం, ఎం. బాలు, చింతకింది కృష్ణ, ఎం.డి. హనీప్ , ఉపేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీని శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.



