Saturday, August 15, 2026
E-PAPER
Homeఖమ్మంఘనంగా సండ్ర వెంకట వీరయ్య జన్మదిన వేడుకలు

ఘనంగా సండ్ర వెంకట వీరయ్య జన్మదిన వేడుకలు

- Advertisement -

– సేవా కార్యక్రమాలతో హోరెత్తించిన బీఆర్ఎస్ శ్రేణులు
నవతెలంగాణ – సత్తుపల్లి

సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య గారి జన్మదిన వేడుకలను శనివారం సత్తుపల్లిలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంరకు శుభాకాంక్షలు తెలిపారు. పాత సెంటర్లోని సండ్ర ​క్యాంపు కార్యాలయం నుండి బయలుదేరిన నాయకులు, కార్యకర్తలు సత్తుపల్లి బస్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి, తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

​సండ్ర వెంకట వీరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పలు సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సత్తుపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్, పాలు పంపిణీ చేశారు. కొత్తూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనితో పాటు ఎన్టీఆర్ కాలనీ, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో పేదలకు, రోగుల అన్నదానం నిర్వహించారు.

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జెండా వందన వేడుక 
పాత సెంటర్లోని సండ్ర వెంకట వీరయ్య క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జెండా వందన కార్యక్రమాన్ని  బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ మాజీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ముఖ్య నాయకులు దొడ్డా శంకరరావు, మోరంపూడి ప్రభాకర్, వీరపనేని బాబీ, షేక్ రఫీ, మల్లూరి అంకంరాజు, పర్వతనేని వేణు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -