– వాడ వాడన రెపరెప లాడిన జాతీయ పతాకం..
నవతెలంగాణ – ఊరుకొండ
ఊరుకొండ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, యువజన సంఘాల అధ్యక్షులు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగరవేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామాల్లోని వాడవాడనా జాతీయ జెండా రెపరెపలాడింది. ఊరుకొండ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై రమాదేవి, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో సత్యపాల్ రెడ్డి, తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ యూసఫ్ అలీ, ఆయా ప్రభుత్వ కార్యాలయాల వద్ద సంబంధిత అధికారులు, యువజన సంఘాల వద్ద ఆయా సంఘాల అధ్యక్షులు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వివిధ పార్టీల నాయకులు, పెద్దలు, యువతి యువకులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



