Sunday, August 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రేక్ష‍కుల్ని సర్‌ప్రైజ్‌ చేసే ‘ఆస్మాన్‌’

ప్రేక్ష‍కుల్ని సర్‌ప్రైజ్‌ చేసే ‘ఆస్మాన్‌’

- Advertisement -

శ్రీమతి కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ మీద మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’. వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, అర‌బిక్ భాష‌ల్లో రూపొందుతోంది. స్వ‌ర్గీయ న‌టుడు శ్రీహరి జయంతి సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను శనివారం రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో.. శాంతి శ్రీహరి మాట్లాడుతూ,‘మేఘాంశ్ మీద నమ్మకంతో ‘ఆస్మాన్’ చేసేందుకు ముందుకు వచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మేఘాంశ్‌ని కూడా పగలు, రాత్రి అన్న తేడా లేకుండా వర్క్ చేయిస్తున్నారు. శ్రీహరి కూడా అలానే నటించేవారు. ఆర్టిస్టులు ఎప్పుడూ అలానే కష్టపడి నటించాలి. ఈ సినిమాతో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలని ఓ తల్లిగా కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. రామ్‌తో వర్క్ చేయడం ఓ గొప్ప ఎక్స్‌పీరియెన్స్. సెట్‌లో ఎప్పుడూ ఓ పండుగ వాతావరణం కనిపించేది. రాయంచ మా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రశాంత్ బీజీఎం అద్భుతంగా ఉండబోతోంది’ అని హీరో మేఘాంశ్ శ్రీహరి చెప్పారు. దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ,‘థియేటర్లో ఈ సినిమా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది’ అని అన్నారు. నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ,‘మేఘాంశ్ యాక్టింగ్ చూసి అందరం ఆశ్చర్యపోయేవాళ్లం. రియల్ స్టార్ కొడుకు అంటే ఇలానే ఉంటాడనిపించేలా ఉంటాడు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -