Sunday, August 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంస్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో..లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు పోరాటం

స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో..లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు పోరాటం

- Advertisement -

కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్, మతోన్మాద 
విధానాలను తిప్పికోడతాం
కార్మికుల హక్కులకు కాలరాస్తున్న 
పాలకులకు బుద్ధిచెబుతాం
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

నవతెలంగాణ-సంగారెడ్డి
స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో లేబర్ కొడ్స్ రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తామని, కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్, మతోన్మాద విధానాలను తిప్పికోడతామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. శనివారం సీఐటీయూ సంగారెడ్డి జిల్లా ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకత్వ స్థాయి క్లాసులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. కార్మికులు ఐక్యంగా పోరాడితేనే హక్కులు రక్షించుకుంటామన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం పట్టించుకోకుండా కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందన్నారు. కార్మికులు మతం, కులం పేరిట విడగొట్టే ప్రయత్నాలను తిప్పి కొట్టాలన్నారు. శాస్త్రీయ దృక్పథం, ప్రజాస్వామ్య విలువలు కలిగి ఉండాలన్నారు. నిత్యావసర ధరలు పెరిగినా కార్మికుల వేతనాలు మాత్రం పెరగలేదన్నారు. పెరిగిన ధరలతో ఒక్కొక్క కుటుంబంపై మోయలేని భారం పడుతుందనన్నారు. కార్మికులను బానిసలు చేసేలా అమలు చేయాలని చూస్తున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తీరుతామన్నారు. మతతత్వ, మతోన్మాద, కార్పోరేట్ రాజకీయాలకు వ్యతిరేకంగా, ప్రపంచాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న సామ్రాజవాదానికి వ్యతిరేకంగా కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉపాధి, నాణ్యమైన విద్య, ప్రజాస్వామ్య హక్కుల కోసం యువత పోరాడడం శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. సాయిలు, నాయకులు కే.రాజయ్య, ఏ. మాణిక్, యాదగిరి, ప్రవీణ్, మహిపాల్, నాగేశ్వరరావు, విద్యాసాగర్, సురేష్, మంజుల కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -