Monday, August 17, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఎమ్మార్వో కార్యాలయంలో పాము కలకలం

ఎమ్మార్వో కార్యాలయంలో పాము కలకలం

- Advertisement -

భయభ్రాంతులకు గురైన సిబ్బంది, ప్రజలు 
నవతెలంగాణ-కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గదిలో పాము కలకాలం రేపింది. దీంతో మండల కార్యాలయానికి విధులు నిర్వహించేందుకు వచ్చిన సమయంలో పాము గదిలో అధికారులకు కనిపించడంతో అధికారులతో పాటు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అధికారులు కార్యాలయ గది నుంచి ఉరుకులు, పరుగులు తీశారు. అనంతరం అధికారులు పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించగా.. వెంటనే ఆయన అక్కడికి చేరుకొని గదిలో ఉన్న పామును సురక్షితంగా పట్టుకొన్నారు. దీంతో ఒక్కసారిగా అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పామును అక్కడి నుంచి అటవీ ప్రాంతాల్లో వదిలేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -