Monday, August 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కళ్యాణ లక్ష్మి పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలి 

కళ్యాణ లక్ష్మి పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలి 

- Advertisement -

బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో.. తాసిల్దార్ కు వినతి
నవతెలంగాణ-నెల్లికుదురు 

బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పేదింటి ఆడపిల్లలకు అందించే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకమును సుప్రీంకోర్టు సాకుతో ఆపే కుట్ర చేస్తుందని దాని వెంటనే పునరుద్ధచి పేద ఇంటి ఆడపిల్లలకు అందివ్వాలని ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వెన్నాకుల శ్రీనివాస్  మేచరాజు పల్లి సర్పంచ్ తూర్పాటి శంకరయ్య, సీనియర్ నాయకులు ఎర్రబెల్లి నవీన్ రావు బత్తిని అనిల్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై బైఠాయించి అనంతరం తాసిల్దార్ కార్యాలయం వరకు వెళ్లి తాసిల్దార్ చందా నరేష్ కు వినతి పత్రాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేరేంటి ఆడపిల్ల పెండ్లికి కొంత సహాయంగా కేసీఆర్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి పేదింటి కుటుంబాలకు అండగా ఉండే విధంగా ఆర్థికంగా సహకరించిందని అన్నారు. ఆ పథకం రాష్ట్రంలో ఎంతోమందికి సహాయపడిందని తెలిపారు అలాంటి మంచి పథకాన్ని నేడు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి కాంగ్రెస్ వచ్చాక ఆ బతకాన్ని రద్దు చేయాలని కుట్ర పండుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఎదగడం కోసం హామీలు ఇవ్వని పథకాలు కూడా అమలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసిఆర్ కి దక్కిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరు కూడా బాగుపడే దాఖలు లేవని తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్ అశ్విన్ ,సీనియర్ నాయకులు బీముడు వరిపల్లి వెంకటేష్, రహిమాన్, భోజ్య నాయక్ ,ఎడ్ల మహేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు 

రాస్తారోకో ను విరవింపచేసిన పోలీసులు
బిఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తూ రోడ్డుపై బైఠాయించి వచ్చి పోయే వాహనాలను ఆపి నిరసన కార్యక్రమం తెలుపుతున్న బిఆర్ఎస్ పార్టీ నేతలు రవాణాకు ఆటంకం కలిగించవద్దు అనే ఉద్దేశంతో ఘటనా స్థలానికి ఎస్సై గంగారావు కర్ణాకర్ వారి సిబ్బందితో చేరుకొని రాస్తారోకో నిర్వహిస్తున్న బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను మీరు రహదారిపై కూర్చోవద్దు వాహనాలకు ఇబ్బంది జరుగుతుంది అని వారికి నచ్చజెప్పి రాస్తారోకోను బందు చేశారు ప్రయాణికులకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -