Monday, August 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ -రాయపోల్
శ్రావణ శుద్ధ పంచమి సందర్భంగా నాగుల పంచమి పర్వదినాన్ని సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే మహిళలు, భక్తులు నాగదేవత పుట్టల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టలకు పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి నాగదేవతకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భక్తులు ప్రార్థించారు. కొత్తగా పెళ్లైన దంపతులు సైతం నాగదేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో గ్రామాల్లో పుట్టల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.హిందూ సంప్రదాయంలో శ్రావణ శుద్ధ పంచమికి నాగ పంచమిగా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది ఆగస్టు 17న నాగ పంచమి జరుపుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -