- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బెంగాల్‌లో న్యాయాధికారులను నిర్భంధించిన సంఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలపై సుప్రీంకోర్టు సుమోటగా కేసును స్వీకరించి బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఘటనపై పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది. ఈక్రమంలోనే ఏడీజీ నార్త్ బెంగాల్ కె. జయరామన్ పలు విషయాలు వెల్లడించారు. ఈ ఘటనతో సంబంధమున్న 35మందిని అదుపులోకి తీసుకున్నామని శుక్రవారం మీడియాకు తెలిపారు. దర్యాప్తులో భాగంగా అందర్నీ విచారిస్తున్నామన్నారు. ప్లాన్ ప్రకారం జరిగిందా, కుట్ర కోణం దాగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే సమగ్ర నివేదిక తయారు చేస్తామని చెప్పారు.
- Advertisement -



