Tuesday, August 18, 2026
E-PAPER
Homeసినిమాప్రేమలోని అందమైన క్ష‍ణాలు..

ప్రేమలోని అందమైన క్ష‍ణాలు..

- Advertisement -

డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాతో మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ఆసక్తి పెంచుకున్న ఈ సినిమా నుంచి తాజాగా రెండో సింగిల్ ‘చిన్ని చిన్ని’ను మేకర్స్ విడుదల చేశారు.
ఎస్. థమన్ కంపోజ్ చేసి, ప్రోగ్రామ్ చేసి, అరేంజ్ చేసిన ఈ పాట ఫ్రెష్, మెలోడీయస్ రొమాంటిక్ నెంబర్‌గా ఆకట్టుకుంటోంది. అకౌస్టిక్ సౌండ్స్‌కు ఎనర్జిటిక్ ఎలక్ట్రానిక్ బీట్స్‌ను జోడించిన థమన్.. ఎలక్ట్రిక్ మాండలిన్, రిథమ్ గిటార్స్, సాఫ్ట్ సింథ్స్‌తో పాటకు మంచి రిచ్ సౌండ్ తీసుకొచ్చారు. మోహిత్ చౌహాన్ తన సిగ్నేచర్ వాయిస్‌తో పాటకు నాస్టాల్జిక్ ఫీల్ తీసుకొచ్చారు. కళ్యాణ్ చక్రవర్తి రాసిన లిరిక్స్ ప్రేమలో పడినప్పుడు కలిగే ఆ చిన్న చిన్న ఆనందాలు, రోజువారీ క్షణాల్లో పుట్టే ప్రేమను అందంగా చెబుతున్నాయి. ‘చిన్ని చిన్ని నా పాటే’ అనే హుక్ లైన్ పాటకు మరింత క్యాచీ ఫీల్ ఇచ్చింది.
స్కూటర్‌పై పచ్చని లొకేషన్లలో, సిటీ స్ట్రీట్స్‌లో కలిసి తిరగడం నుంచి.. రూఫ్‌టాప్‌పై ప్రశాంతంగా గడిపే క్షణాలు, రద్దీగా ఉన్న మెట్రోలో ఒకరికొకరు దొంగచూపులు చూసుకోవడం, చివరికి థియేటర్‌లో తమ ప్రేమకథను చూసుకోవడం వరకు.. అనీష్, అనస్వర రాజన్ మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా, నేచురల్‌గా అనిపిస్తోంది. విడుదలైన వెంటనే పాటకు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ రావడంతో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. మా రొమాటింక్‌ మెలోడీ సాంగ్‌ మాదిరిగానే సినిమా కూడా ప్రేక్ష‍కుల్ని ఆద్యంతం అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని మేకర్స్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -