– వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి
నవతెలంగాణ-నాచారం
నాచారం రాఘవేంద్ర నగర్లో డ్రైనేజ్ మ్యాన్‌హోల్స్ ప్రమాదకరంగా మారడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల డ్రైనేజ్ మ్యాన్‌హోల్స్ మూతలు ధ్వంసమై ఉండటంతో పాదచారులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు నిత్యం భయాందోళనల మధ్య ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యంగా రాత్రి వేళల్లో మ్యాన్‌హోల్స్ స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి ధ్వంసమైన మ్యాన్‌హోల్స్‌కు కొత్త మూతలు ఏర్పాటు చేయాలని, ప్రమాదాలు జరగకముందే సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.



