Tuesday, August 18, 2026
E-PAPER
Homeజిల్లాలుజనగామ జిల్లాకు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి

జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు రూరల్ 
సర్వాయి పాపన్న గౌడ్ ధైర్య సాహసాలు, పోరాట పటిమ, ప్రజల కోసం చేసిన త్యాగాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి విశ్వనాథం గౌడ్ అన్నారు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో తెలంగాణ వీరుడు, బహుజన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి విశ్వనాథం గౌడ్, ఆలేరు మండల అధ్యక్షులు పోతుగంటి సంపత్ కుమార్ గౌడ్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బైరి విశ్వనాథం గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డపై సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన చూపిన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. తెలంగాణ శివాజీగా పేరుగాంచిన సర్వాయి పాపన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న చరిత్రను యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన చూపిన పోరాట స్ఫూర్తి, ఆత్మగౌరవ భావనను సమాజంలో కొనసాగించాలని సూచించారు.

సర్వాయి పాపన్న సేవలు, పోరాట చరిత్రను భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు మాసాపేట రాజు గౌడ్,పాప రాజు గౌడ్,సోమలింగం గౌడ్,మిట్టపల్లి పాండు గౌడ్, రమేష్ గౌడ్, బాగయ్య గౌడ్,రాజయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రవి గౌడ్‌తో పాటు గ్రామస్థులు,నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -